calender_icon.png 27 January, 2026 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద రోగుల పట్ల.. ‘ఓపి’క లేదా..!?

27-01-2026 12:00:00 AM

జీతం ప్రభుత్వానిది.. ప్రైవేటులో ప్రాక్టీస్

జనరల్ ఆస్పత్రిలో దురుసుతనం తమ సొంత ఆస్పత్రిలో మమకారం

అక్రమంగా డిప్యూటేషన్ పేరుతో తిష్ట 

తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పేద రోగులు

నాగర్ కర్నూల్ జనవరి 26 (విజయక్రాంతి): వైద్యో నారాయణ హరి.. వైద్యుడు సాక్షాత్తు దైవంతో సమానం అని నానుడి.. కానీ నాగర్ కర్నూల్ జిల్లాలోని పరిసర పట్టణ కేంద్రాల్లోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు మాత్రం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కేంద్రంగా చేసుకొని వైద్యం వ్యాపారంగా మలుచుకున్నారని చర్చ జరుగుతోంది. అక్రమం గా డిప్యూటేషన్లు వేయించుకొని నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో తిష్ట వేసి ప్రభుత్వ జీతం పొందుతున్న సదరు వైద్యులు తాము ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ ఆసుపత్రి సామ్రాజ్యాన్ని డెవలప్ చేసుకుంటున్నారని సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా విధులు నిర్వర్తించాల్సిన డాక్టర్లు వారి వారి సొంత ప్రైవేటు ఆసుపత్రిలో రోగులను మళ్లించి లక్షలు దోచేస్తున్నారు. ప్రభుత్వ ఆ సుపత్రిలో ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించిన సమయంలో టీ, టిఫిన్ చేయడానికి, డిన్నర్ చేయడానికి అంటూ కుంటి సాకులు చెప్తున్నారు.

ఉచిత నాణ్యమైన వైద్యం అందించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాసుపత్రుల్లో సకల సౌకర్యాలను మెరుగుపరుస్తున్న క్రమంలోనూ డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు డుమ్మా కొట్టి ప్రైవేటు ఆసుపత్రులను అంచలంచలుగా పెంచుకొని వైద్యాన్ని వ్యాపారంగా మల్చుకుంటున్న వ్యవహారంపై ప్రజా ప్రతినిధులు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. వీరిపై పర్యవేక్షణ చేయాల్సిన సదరు అధికారులు ప్రశ్నించిన క్రమంలో ఎమ్మెల్యే, ఎంపీ మావోడే అంటూ ఉన్నతాధికారులకే దమ్కీలిస్తున్నట్లు కూడా జోరుగా చర్చ జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పేద రోగులకు మెరుగైన వైద్యం అందరిని ద్రాక్ష గా ఓ కలగా మిగులుతోందని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.  నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా మారిన అనంతరం మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెంపు అన్ని విభాగాల్లో ప్రొఫె సర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందిని నియమిస్తూ వస్తున్నారు.

అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ వంటి ఏరియా ఆసుపత్రుల నుంచి జిల్లా జనరల్ ఆస్పత్రికి రోగులు అధిక సంఖ్యలో వస్తుంటారు. దాం తోపాటు సుదూర గ్రామాల నుంచి నిత్యం వేల సంఖ్యలో రోగులు వస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రులు కొంత మెరుగుపడ్డాయాని ప్రజల్లో నమ్మకం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో రోగుల సంఖ్య కూడా బాహాటంగా పెరిగింది. దీన్నే అదునుగా చేసుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రి మాఫియా రాజకీయ పలుకుబడితో స్థానిక ప్రభుత్వాసుపత్రుల్లో డిప్యూటేషన్లపై డ్యూటీలు వేసుకొని దగ్గర్లోని తమ ప్రైవేటు ఆసుపత్రులను మెరుగుపరుచుకునేందుకు పావుగా వాడుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉదయం సమయంలో ఇలా వచ్చి బయోమెట్రిక్ లేదా హాజరు రిజిస్టర్లో సంతకాలు చేసి ప్రైవేటు ఆసుపత్రిలోనే బిజీగా గడుపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను తమ వైపు తిప్పుకునేందుకు కమిషన్ల రూపంలో ఓ ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు పర్యవేక్షణ జరిపి ప్రభుత్వ వైద్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సదరు రైతుల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజల్లో డిమాండ్ వినిపిస్తోంది.