27-01-2026 12:00:00 AM
సుల్తానాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకే సిగ్నల్ వ్యవస్థను ఏర్పర్చినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల రోడ్డు చౌరస్తాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థను పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ లతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం వాహనాలు పెరుగుతున్నాయని తద్వారా ట్రాఫిక్ అధికంగా పెరుగుతుందని ట్రాఫిక్ వ్యవస్థతో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేలా ప్రమాదాలను నివారించేందుకు సిగ్నల్ లైట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సిఐలు సుబ్బారెడ్డి, అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్,
ఎస్త్స్రలు చంద్రకుమార్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి మహేందర్, ప్రముఖ వ్యాపారవేత్తలు నగునూరి అశోక్ కుమార్, మాడూరి ప్రసాద్, చకిలం మారుతి, వేగోళం అబ్బయ్య గౌడ్, ముత్యాల రవీందర్, కందుకూరి ప్రకాష్ రావు, గాజుల రాజమల్లు, బిరుదు కృష్ణ, సర్కిల్ పరిధిలోని ట్రాఫిక్, సివిల్ ఎస్‌ఐ లు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ల తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పలువురు పాల్గొన్నారు.