4 June, 2026 | 3:29 AM

రుణాలు, సమస్యల సాధనకై వినతి

04-06-2026 02:35 AM

ఆదిలాబాద్, జూన్ 3 (విజయక్రాంతి) :ఆదిలాబాద్ టీఎస్ జీఎల్‌ఐ కార్యాలయంలో ఉపాధ్యాయుల దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నసమస్యల పై ఆదిలాబాద్లోని టీఎస్ జీఎల్‌ఐ కార్యాలయాన్ని నిర్మల్ జిల్లా ఎస్టియూ జిల్లా అద్యక్షుడు భూమన్న యాదవ్ సందర్శించి, నిర్మల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అధికారులతో విస్తృతంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా పలువురు ఉపాధ్యాయుల టీఎస్ జీఎల్‌ఐ పాలసీలలో పేర్లు, ఇంటి పేర్లు  నమోదు విషయంలో ఉన్న తప్పులను గుర్తించి, వాటి సవరణకు సంబంధించిన వివరాలను కా ర్యాలయ అధికారులకు అందజేయడం జరిగింది.

అలాగే కొంతమంది ఉపాధ్యాయుల జీతాల నుండి ప్రతి నెలా మినహాయిస్తున్న టీఎస్ జీఎల్‌ఐ కటింగ్ సబ్స్క్రిప్షన్లు వారి ఖాతాలలో ప్రతిబింబించకపోవడం, కొన్ని నెలల చందాలు నమోదు కాకపోవడం వం టి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లా రు. ఈ అంశాలపై అవసరమైన పత్రాలను సమర్పించి, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.అదేవిధంగా ఉపాధ్యాయులు టీఎస్జీఎల్‌ఐ రుణాలు (Loans) పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దరఖాస్తుల పరిశీలన, మంజూరు ప్రక్రియ, అవసరమైన ధ్రువపత్రాలు మరియు ఇతర పరిపాలనా అంశాలపై కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ బాపయ్య తో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, పెండింగ్లో ఉన్న అంశాలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుల ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సేవా, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు సంఘం తరఫున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు.