1 September, 2026 | 1:04 AM

లక్కీ డ్రా పద్ధతిలో ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక

01-09-2026 12:00 AM

అల్వాల్, ఆగస్టు 31, (విజయక్రాంతి) : తెలంగాణ హౌసింగ్ బోర్డ్ నార్త్ డివిజన్ వారు ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సోమవారం అల్వాల్ పరిధిలోని విబిఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా లాటరీ ప్రక్రియ చేపట్టారు. అర్హులైన దరఖాస్తుదారుల నుండి లాటరీ పద్ధతిలో లబ్ధిదారు లను ఎంపిక చేసి  ప్లాట్లను కేటాయించనున్నారని మల్కాజ్గిరి  ఆర్డీవో శ్యాం ప్రకాష్ తెలిపారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవక తవకలకు తావు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో సిద్ధార్థ, వి వాసు(పీఆర్ ఓ), హౌసింగ్ బోర్డ్ సెక్రటరీ ఎస్. విమల, జీ.వాణి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.