5 March, 2026 | 11:31 AM

మొక్కజొన్న రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం: హరీశ్ రావు

05-03-2026 02:36 AM

కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని హరీశ్‌రావుకు వినతి

నంగునూరు, మార్చి 4: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సాగు పెట్టుబ డి సాయం అందించడంలో విఫలమైన రేవంత్ సర్కార్, కనీసం పండించిన పంట ను కొనుగోలు చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన మండిపడ్డారు.

బుధవారం కోకపేటలోని హరీశ్‌రావు నివా సంలో నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామ రైతులు ఆయనను కలిసి,గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ,అక్కెనపల్లి (ఆరేపల్లి) గ్రామంలో సుమారు 350 ఎకరాల్లో మక్క సాగు చేసిన రైతులు కొనుగోలు కేంద్రాలు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం, రవాణా సౌకర్యాల లేమి, చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలు రైతులను ఆర్థికంగా కుదేలు చేస్తున్నాయని పేర్కొన్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆరేపల్లి తో పాటు అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మద్దతు ధర (ఎం ఎస్ పి) చెల్లించి మక్కలను సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

33 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేయాలి

అక్కెనపల్లి గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను రైతులు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు.లో-వోల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటర్లు పదేపదే ట్రిప్పింగ్ అవుతూ కాలిపోతున్నాయని, దీనివల్ల సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని వారు వివరించారు. అక్కెనపల్లి కి 33 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హరీష్ రావు, విద్యుత్ అధికారులతో మాట్లాడి తక్షణమే ప్రతిపాదనాలు పంపించాలని అధికారులను ఆదేశించారు.