13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బస్ సర్వీసులు పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి

31-03-2026 04:20 PM

హుజురాబాద్,(విజయక్రాంతి)హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు నూతన బస్ సర్వీసులకు ఆమోదం తెలపాలని రాష్ట్ర బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రిని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కోరారు. హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని మంగళవారం అందజేశారు. దాంతో పాటు హుజూరాబాద్ డిపో పరిధిలో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలని కోరారు.

ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించారని ప్రణవ్  తెలిపారు. బేతిగల్ నుంచి కరీంనగర్, మర్రిపల్లిగూడెం నుండి హైదరాబాద్, జమ్మికుంట నుండి హైదరాబాద్ కు ఇప్పటికే సర్వీసులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కాగా, మరికొన్ని ప్రాంతాలకు కూడా నూతన సర్వీసులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోట రాజేంద్ర ప్రసాద్, గూడూరి స్వామి రెడ్డి, నేరెళ్ళ మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.