28 February, 2026 | 9:16 AM

బస్సు పునరుద్ధరించాలని ఎమ్మెల్సీకి వినతి

28-02-2026 01:31 AM

సంస్థాన్ నారాయణపూర్, ఫిబ్రవరి 27 : సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామానికి గత కొంతకాలంగా నిలిచిపోయిన బస్సు సర్వీసును  పునరుద్ధరించాలని గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు కలిసి స్థానిక ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కు వినతి పత్రం అందజేశారు.

గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్థులు, అత్యవసర వైద్య అవసరాల సమయంలో పట్టణానికి చేరుకోవడం కష్ట సాధ్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ కేంద్రానికి పని కోసం కూలీలు చిన్న వ్యాపారులు కూడా రవాణా సౌకర్యం  లేక ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.

కనీసం రోజుకు రెండుసార్లు బస్సు నడపాలని వారు కోరారు. రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరగతిన సమస్యను  పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి,వార్డు సభ్యులు కత్తుల మల్లయ్య, బద్దుల సుధాకర్, కత్తుల విజయ్, కురుమతి దేవరాజు, కత్తుల నరేష్, తదితరులు పాల్గొన్నారు.