28 February, 2026 | 7:44 AM

చిన్నారి హత్య నిందితులను కఠినంగా శిక్షించాలి

28-02-2026 01:33 AM

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 27 : నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో రెండు నెలల చిన్నారి హత్యను నిరసిస్తూ సిపిఎం పార్టీ యాదగిరిగుట్ట కమిటీ ఆధ్వర్యంలో కుల దురహంకార దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కుమ్మర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా గణేష్ మౌనిక కూతురు దైవదర్శనం కోసం లైన్ లో నిలబడ్డ సందర్భంలో ఎస్సీ, బీసీలు వచ్చారని కుల దురాహంకారులు వారిపై దాడి చేసి రెండు నెలల పసిపాపను హత్య చేసి వారం రోజులు గడుస్తున్న పోలీసు యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని, చిన్నారి కుటుంబానికి భద్రత కల్పించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జూకంటి పౌలు,ఎస్.కె షరీఫ్,ఈశ్వర్ రెడ్డి, సీసా శ్రీనివాస్, రజక సంఘం జిల్లా నాయకులు బొజ్జ సాంబెష్, ఓబీసీ కాంగ్రెస్ సెల్ అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్, రజక సంఘం మండల అధ్యక్షుడు నమిలే శ్రీశైలం,రాసమల్ల నరేష్ రజక సంఘం నాయకులు బిక్షపతి రజక సంఘం పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.