23 May, 2026 | 12:51 AM

రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వినతి

23-05-2026 12:00 AM

మేడ్చల్ పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు:చీర్ల సత్యనారాయణ

మేడ్చల్ అర్బన్ మే 22(విజయక్రాంతి):రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మేడ్చల్ పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు చీర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మేడ్చల్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యం చేతికి వచ్చి రోజులు గడుస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం ధాన్యాన్ని సేకరించకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు.ధాన్యం కొనుగోలులో జరుగుతున్న ఆలస్యం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు.

అంతే కాకుండా  కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగుల కొరత, రవాణా సౌకర్యాలేమి లేకపోవడం తూకాలలో అవకతవకలు జరుగుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సత్యనారాయణ తెలియజేశారు.రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని మేడ్చల్ మండల తహసిల్దార్ స్పందించి ఉన్నత అధికారులతో మాట్లాడి రైతుల నుండి పండించిన వడ్లను యుద్ధ ప్రాతిపాదికన కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సత్యనారాయణ కోరారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ డివిజన్ బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్.ఎల్లం పేట్ మున్సిపల్ పట్టణ బిజెపి అధ్యక్షులు ఎక్కలదేవ్ శ్రీశైలం యాదవ్.జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్.మేడ్చల్ డివిజన్ పట్టణ ప్రధాన కార్యదర్శులు జాకట ప్రేమ్ దాస్.కే మహేష్.వంశీ కానుగంటి.ఉపాధ్యక్షులు మైసరి రాజు.కార్యదర్శి బండి విష్ణు గౌడ్ నాయకులు సర్వేశ్వర్ రెడ్డి.దాత్రిక లక్ష్మణ్.సిహెచ్ శ్రీనివాస్ గౌడ్.బి రాఘవరెడ్డి.వంశీధర్ రెడ్డి.ఎన్ శ్రీనివాస్ గౌడ్.బాబుగౌడ్.జాకట బాబు.రతన్ రాథోడ్.గౌలికర్ మహేష్.రవి నాయక్.పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.