60 గజాల పట్టాల సమస్య పరిష్కరించాలని వినతి
భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన గ్రామ ప్రతినిధులు
మొయినాబాద్, జూన్ 23 (విజయ క్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్లో 60 గజాల ఇంటి స్థలాల పట్టాల సమస్య పరిష్కారం కోసం గ్రామ ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఉ పముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కో మటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే కాలే యాద య్య సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామ ప్రజల తరఫున గతంలో మంజూరైన పట్టాల ప్రతులు, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల (జి.ఓ) కాపీలను నాయకులకు అందజేశారు.
సమస్యను పూర్తిగా పరిశీలించిన భట్టి విక్రమార్క, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇ చ్చినట్లు తెలిపారు. అదేవిధంగా మంత్రి కో మటిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం మరోసారి సమావేశమై ఈ అంశంపై సమగ్రంగా చర్చించి పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.
స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ మల్లేష్ యాదవ్, గ్రామ యువకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారం కోసం గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.






