రోడ్డుకు ట్రంప్ పేరు వెంటనే ఉపసంహరించుకోవాలి
24-06-2026 01:08 AM
మధిర, జూన్23 (విజయ క్రాంతి): హైదరాబాద్ లోని రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ పేరు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మధిర పట్టణంలో మెయిన్ రోడ్ లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడం సిగ్గు సిగ్గు, యుద్ధోన్మాది ట్రంప్ పేరును వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయం అన్నారు. ఈ కార్యక్రమంలో తేలబ్రోలు రాధాకృష్ణ, పడకంటి మురళి, మంద సైజులు పాల్గొన్నారు.






