25 March, 2026 | 3:02 AM

బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్‌కు వినతి

25-03-2026 01:23 AM

జనగామ, మార్చి 24 (విజయక్రాంతి): జనగామ బస్సు డిపో నుండి కోడూరు గ్రామానికి బస్సు రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని కోరుతూ మంగళవారం కోడూరు గ్రామ సర్పంచ్ గోడిశాలలలిత సోమయ్య , వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు కలిసి జనగామ డిపో మేనేజర్ (డి ఎం) స్వాతికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొంతకాలంగా బస్సు రాకపోకలు బంద్ కావడంతో విద్యార్థులు, కూలీలు, నిత్యం పట్టణానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నామని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ స్వాతి.. సమస్యను పరిష్కరించి వీలైనంత త్వరగా కోడూరు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపీటీసీ గొరిగ భాస్కర్, ఉప సర్పంచ్  చాగంటి యాదగిరి, వార్డు సభ్యులు భాష పాక మధు, కౌడ వీరేష్, భాష పాక మణికుమార్, దుబ్బాక అజిత్, చిట్యాల స్వామి తదితరులు పాల్గొన్నారు.