25 March, 2026 | 2:56 AM

అల్ఫోర్స్‌లో ఎన్‌సీసీ శిబిరం

25-03-2026 01:22 AM

కొత్తపల్లి, మార్చి 24 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో గత రెండు రోజులుగా ఎన్సిసి శిబిరం లో శిక్షణ నిర్వహిస్తున్నారు. మంగళవారం  కెడెట్లతో  అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి  ముఖాముఖి నిర్వహించారు. సందర్భంగా ఆ యన మాట్లాడుతూ విద్యార్థులకు దేశభక్తి పట్ల ఆసక్తిని పెంపొందించాలని,

దేశం పట్ల నిర్వర్తించేటువంటి పలు హక్కులను, విధులను ప్రణాళిక బద్ధంగా తెలియపరచాలని తద్వారా వారు బాధ్యతయుతంగా  వ్యవహరిస్తారని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థికి నైతిక వి లువల పట్ల కనీస అవగాహనతో పాటు వాటిని అమలుపరిచే విధానాలను తెలుసుకోవాలని సూచించారు.  సుమారు 150 మంది విద్యార్థులకు శిక్షణతో పాటు భోజన వసతిని కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్,విద్యార్థులు పాల్గొన్నారు.