calender_icon.png 22 November, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల

22-11-2025 01:40:48 PM

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఉత్తర్వులు జారీ..

సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్‌..

రిజర్వేషన్లు 50 శాతం మించకూండా మార్గదర్శకాలు జారీ


హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల(Gram Panchayat elections) రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవీ విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల  చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. కులగణన ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డీవోలు సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎంపీడీవోలు వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. శనివారం సాయంత్రం వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.