28-10-2025 12:37:44 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఏఎంఎస్ స్కూల్ ఆఫ్ ఇ న్ఫర్మేటిక్స్(ఆంసాయి)లో సోమవారం ఎం బీఏ 2025--2027 బ్యాచ్ కోసం ఇండక్షన్ ప్రోగ్రామ్ ‘ఆరంభ్’ను నిర్వహించింది. హైదరాబాద్లోని హెచ్‌యూఎం కన్సల్టింగ్ వ్యవస్థా పకుడు చాంద్ నారాయణ్ ముఖ్య అతిథిగా, ఏఎంఎస్ అధ్యక్షురాలు ఉషా కందా గౌరవ అతిథిగా హాజరయ్యారు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ పి.వేణుప్రియ మాట్లాడుతూ.. ‘ఈ రెండు సంవత్సరాలు మీ జీవి తంలోని ఉత్త మ సంవత్సరాలు.
ఉపయోగించుకోండి, గొప్ప స్థానాన్ని కైవసం చేసు కోండి’ అన్నారు. గౌరవ అతిథి ఉషా కంద, అధ్యక్షురాలు, దు ర్గాబాయి దేశ్‌ముఖ్ సంస్థ మాట్లాడుతూ.. ‘మీరంతా జీవితానికి మంచి లక్ష్యాన్ని నిర్ణయించుకోండి అది మీతో పాటు సమాజాభివృద్ధికి దోహదపడేలా కృషి చేయాలన్నారు. చాంద్ నారా యణ మాట్లాడుతూ.. ‘ఎంతగా శ్రమిస్తారో, అంత మంచి ఫలాల ను అందుకుంటారు‘ అం టూ, ఒక కంపెనీ మీ సామర్థ్యం, నైపుణ్యాలు, పోటీసామర్ధ్యా న్ని బేరీజు వేసి మీకు జీతాన్ని నిర్ణయిస్తుంది.
అద్భుతమైన ప్యాకేజీని పొందాలంటే, ఇప్పు డే మీ ప్రయ త్నాలకి పదునుపెట్టండి’ అని సూచించారు. కళాశాల సెక్రటరీ వై సత్యనారాయణ మా ట్లాడుతూ ‘స్టార్ట్ అప్స్‘ పెట్టడానికి ఎదగాలంటూ, దానికై గొప్ప వ్యక్తుల జీ విత చరి త్రలు, పరిశోధన గ్రంథాలు చదవాలంటూ, మీ గ్రంథాలయాన్ని గరిష్ట పరిమా ణం వరకు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు ప్రొఫెసర్ సి.వి. రామమోహన్‌రావు పాల్గొన్నారు.