calender_icon.png 1 August, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి... విద్యార్థి సంఘాల ధర్నా

31-07-2025 06:16:24 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాల ముందు గురువారం విద్యార్థి సంఘాలు అనుమతులు లేని పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేయాలని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పిడిఎస్యు (ఎస్ )జిల్లా అధ్యక్షులు ఎన్. బాల్ రాజ్ మాట్లాడుతూ విద్యాశాఖ నుండి  అనుమతులు పొందకుండా బాన్సువాడ పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల నడిపిస్తుండడంతో గత కొద్దిరోజుల క్రితం విద్యార్థి సంఘాల నాయకులు ఈ విషయంపై వివరాలు అడగగా కోర్టు కేసులో ఉందని చెబుతూ మభ్యపెడుతూ వచ్చారని, గురువారం విద్యార్థి సంఘాల తరుపున పాఠశాలకి వెళ్లి ధర్నా చేయడం జరిగింది.

ఇదే సందర్భంలో పాఠశాల ఇంచార్జ్నీ  ప్రశ్నించగా ఇది శ్రీచైతన్య పాఠశాల కాదు కేవలం ట్యూషన్ సెంటర్ అని అర్ధరాహితమైన సమాధానాలు ఇస్తున్నారనీ, కావున ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా నడుస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలను తక్షణమే విద్యాశాఖ అధికారులు సీజ్ చేయవలసిందిగా ఎంఈఓ డీఈఓ గారిని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ గతంలో చేయడం జరుగుతుందనీ, మళ్లీ ఒక్కసారి బ్యాన్స్వాడాలో విద్యార్థులను, తల్లిదండ్రులను విద్యాసంస్థ యజమానులు మరోసారి మోసం చేసే ప్రయత్నంచేస్తున్నారనీ,

ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలకు పూనుకొని పాఠశాలలను ముసివేయనీ పక్షంలో ఎలాంటి అనుమతులు లేని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంతో విద్యాశాఖ అధికారులు కుమ్మక్కయ్యారని అనుకోవాల్సి పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా వారున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఒక్క సంవత్సర కాలం భవిష్యత్ వ్యర్థం అవుతుందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థి సంఘలు విద్యాశాఖ అధికారుల కార్యాలయాలను ముట్టడి చేయవలసి ఉంటుందని, ఈ సందర్బంగా హెచ్చరించారు.