24-11-2025 12:00:00 AM
14 గ్రామాలకు గాను, 7 గ్రామాల రిజర్వేషన్ల ఖరారు
అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 23: గత కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న స్థానిక ఎన్నికలకు అధికారులు రిజర్వేషన్లను ఆదివారం అధికారులు ప్రకటించారు. మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మొత్తం 7 గ్రామాల్లో సర్పంచ్ పదవులకు సీట్లు కేటాయించడం విశేషం.
మిగతా ఏడు సీట్లను జనరల్‌గా కేటాయించారు. మండలంలోని గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.. అనాజ్ పూర్ (ఎస్సీ మహిళ), బండ రావిరాల (ఎస్సీ జనరల్), చిన్న రావిరాల (బీసీ జనరల్), అబ్దుల్లాపూర్ (బీసీ మహిళ), జాఫర్ గూడ (బీసీ మహిళ), లష్కర్ గూడ ( బీసీ జనరల్) మజీద్ పూర్( బీసీ మహిళ), బలిజగూడ (మహిళ జనరల్ ), గుంతపల్లి (మహిళ జనరల్ ), బాటసింగారం (జనరల్ ), గండిచెరువు (జనరల్ ), ఇనాంగూడా (జనరల్ ) కవాడిపల్లి (మహిళ జనరల్), పిగ్లీపూర్ (జనరల్ ) ఈ రిజర్వేషన్ల కేటాయింపుతో మహిళా నాయకత్వానికి మరింత ప్రాధాన్యం లభించనుంది.