calender_icon.png 13 October, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్‌లో సురుకు తగలాలి: హరీశ్ రావు

13-10-2025 01:35:15 PM

అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణను మార్చారు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి(CM Revanth reddy) సురుకు తగలాలని, కాంగ్రెస్ ను చిత్తుగా ఓడిపోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) జూబ్లీహిల్స్ ప్రజలను కోరారు. రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ లో జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, పార్టీ అభ్యర్థి మాగంటి సునీత,. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.... అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణను మార్చారు.. ఒకప్పుడు తెలంగాణ మోడల్ అని దేశమంతా అనుకునేవారు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిందని ఆరోపించారు.

ఏ పని జరగాలన్నా కమిషన్లు అడుగుతున్నారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ లో(Jubilee Hills by-election) కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే ఆరు హామీలు అమలవుతాయని హరీశ్ రావు స్పష్టం చేశారు. పేదల కోసం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తే... బస్తీ దవాఖానాల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. బస్తీ దవాఖానాల్లో మందులు కూడా అందుబాటులో లేవని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీ ఇళ్ల మీదకి బుల్డొజర్లు వస్తాయని హరీశ్ రావు హెచ్చరించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లే కూలుస్తున్నారు.. పెద్దల ఇళ్లు వదిలేస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోతేనే హైడ్రా ఖతం అవుతుందన్న హరీశ్ రావు హైడ్రా బంద్ కావాలంటే మాగంటి సునీతను గెలిపించాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.