8 August, 2026 | 1:15 AM

ఖమ్మంపల్లి కల్వర్టు సమస్య పరిష్కారం

08-08-2026 12:04 AM

మొరం వేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు

మునిపల్లి, ఆగస్టు 7 (విజయక్రాంతి) : మునిపల్లి మండల పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామంలో చినుకు పడితే చిత్తడే.. ఖమ్మం పల్లి కల్వర్టు బురదమయం.. అనే శీర్షికతో జూలై 27న విజయక్రాంతి దినపత్రికలో ప్రచురితమైన విషయం అందరికి తెలిసిందే.

అప్పటి నుండి  శుక్రవారం వరకు ఆ  కల్వర్టు వైపు వాహనదారులు వెళ్లి ఇబ్బందులు పడకుండా భారీ వాహనాలను నిలిపి అడ్డుకట్ట  వేశారు. కాగా విజయక్రాంతిలో వచ్చిన వార్తకు  స్పందించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు శుక్రవారం కల్వర్టు వద్ద మొరం వేసి సమస్యను పరిష్కరించారు. కల్వర్టు వద్ద బురదమయం కాకుండా తమ ఇబ్బందులను తొలగించిన గ్రామ సర్పంచ్ ప్రభుదాస్, అధికారులు, కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.