8 August, 2026 | 1:16 AM

బచ్పన్ పాఠశాలలో బోనాల సంబురాలు

08-08-2026 12:05 AM

అమీన్ పూర్, ఆగస్టు 7 (విజయక్రాంతి) : బీరంగూడలోని బచ్పన్ ప్రైమరీ పాఠశాలలో తెలంగాణ సాంప్రదాయ బోనాల పండగను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ డైరెక్టర్లు సి.హెచ్. శ్రీనివాస్ రావు,  ఆర్. శిరిషారెడ్డి, అలాగే పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ రాఘవేంద్ర హాజరై విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి పండుగ శోభను మరింత పెంచారు. బోనాల పండుగ విశిష్టత, చారిత్రక ప్రాముఖ్యత, తెలంగాణ సంస్కృతిలో దాని స్థానాన్ని వివరిస్తూ ప్రత్యేక సభను నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన బోనాల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించి చిరస్మరణీయంగా నిలిపారు.