నీట్ యూజీ ఫలితాల్లో రెసోనెన్స్ జయకేతనం
హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): నీట్ 2026 ఫలితాల్లో రెసోనెన్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు జయకేతనం ఎగరవేశారు. జాతీయ స్థాయిలో 4, 68 అత్యున్నత ర్యాంకులు సాధించడమే కాకుండా హైదరాబాద్ క్యాంపస్ల నుంచి 250 మందికి పైగా విద్యార్థులు మెడికల్ సీట్లు దక్కించుకునే దిశగా నిలిచారు.
ఈ మేరకు మాదాపూర్‌లో గల ఆశ్రయ కన్వెన్షన్‌లో ఈ విజయాన్ని సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా రెసోనెన్స్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావు మాట్లాడుతూ నీట్ 2026లో మా విద్యార్థులు కనబరిచిన అసాధారణ ప్ర తిభ, వారి అంకితభావానికి, క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్కు నిదర్శనమన్నారు. 4, 68 వంటి టాప్ ర్యాంకులు సాధించడంతో పాటు మా హైదరాబాద్ క్యాంపస్ల నుంచి 250 మందికి పైగా విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించే అవకాశం ఉండటం రెసోనె న్స్ కుటుంబానికి గర్వకారణం అన్నారు.
ఈ విజయానికి సహకరించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, అకడమిక్ బృందాలకు అభినందనలు తెలిపారు. రెసోనెన్స్‌లో రెండేళ్ల రెగ్యులర్ క్లాస్‌రూమ్ విద్యార్థి హిమాన్షుకుమార్ 720 మార్కులకు 690 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచారు. జెన్-ఈడబ్ల్యు ఎస్ కేటగిరీలో ఆలిండియా 4వ ర్యాంకు, ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 111వ ర్యాంకు సాధించారు. ఇంకో రెండేళ్ల రెగ్యులర్ క్లాస్రూ మ్ విద్యార్థి అతిపాముల భార్గవ 720 మా ర్కులకు 680 మార్కులతో హైదరాబాద్ టాపర్‌గా నిలిచారు. ఈయన ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలో ఆలిండియా 68వ ర్యాంకు, ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 268వ ర్యాంకుతో సత్తా చాటారు.






