26 August, 2026 | 3:03 PM

సంఘటన జరిగిన తక్షణమే స్పందించాలి

14-03-2025 01:43 AM

పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

మంచిర్యాల, మార్చి 13 (విజయక్రాంతి ) : ఏదైనా సంఘటన జరిగినప్పుడు పోలీసులు తక్షణమే స్పందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు. గురువారం సాయంత్రం రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పని చేస్తున్న ఎస్ ఐలతో  నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రతి ఒక్క అధికారి మీ వ్యక్తిగత జీవితానికి, మీ సిబ్బంది జీవితాలకు విలువనివ్వాలని, సిబ్బందితో మాట్లాడి దర్బార్ లాంటివి నిర్వహిస్తూ ఏదైనా సమస్యలు ఉంటే వారికి పెద్ద లాగా ఉండి పరిష్కరించాలని సూచించారు. 

క్రమశిక్షణ, నిబద్దతతో కష్టపడి సరైన మార్గంలో విధులు నిర్వహించినప్పుడు గుర్తింపు వస్తుందని, ఏదైనా సంఘటన జరిగినప్పుడు త్వరితగతిన స్పందించి వ్యక్తిగతంగా సంఘటన ప్రాంతానికి వెళ్లాలని, అప్పుడే విలువైన సమాచారం దొరుకుతుందన్నారు. మనం చేసే మంచి పని భవిష్యత్తు తరాలు గుర్తించేలా చేయాలన్నారు. మంచి పని చేసినప్పుడు రివార్డుతో అభినందించడం జరుగుతుందన్నారు. మీ సంకల్ప, నిబద్ధత మీకు గౌరవాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.