calender_icon.png 2 August, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘హైవేపై కానిస్టేబుళ్ల హంగామా’ కథనానికి స్పందన

02-08-2025 02:06:46 AM

ఎస్సైని వివరణ కోరిన ఎస్పీ,  ఎస్‌బీసీఐ కి విచారణకు ఆదేశం 

కామారెడ్డి, ఆగస్టు 1 (విజయ క్రాంతి), హైవే పై కానిస్టేబుల్ హంగామా కథనానికి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్పందించారు. సంబంధిత ట్రాఫిక్ ఎస్‌ఐ మహేష్ కు వివరణ కోరారు. ఎస్పీ పేరు చెప్పడంపై సీరియస్ అయ్యారు. హైవేపై వాహనాలను ఆపి కానిస్టేబుళ్లు తనిఖీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్ బి సి ఐ ని విచారణ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. విజయ క్రాంతిలో వచ్చిన కథనంపై ఎస్పీ రాజేష్ చంద్ర స్పందించారు. ట్రాఫిక్ ఎస్‌ఐ మహేష్ వివరణ కోరారు. 44వ జాతీయ రహదారిపై కానిస్టేబుల్స్ చాలాన్ల వసులపై ఆరా తీసినట్లు సమాచారం. ఎస్సై లేకుండా ఎక్కడికి వెళ్లావు అని ప్రశ్నించినట్లు సమాచారం. విజయ క్రాంతి కథనం పోలీస్ శాఖలో కలకలం రేపింది.