02-08-2025 02:05:33 AM
హైదరాబాద్, ఆగస్టు 1: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ ఫిర్యాదుతో సీఎంపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం వల్ల బీజేపీకి పరువు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.
బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల కోర్టు ఈ కేసును విచారిస్తుంది. కాగా సదరు కేసును కొట్టేయాలని సీఎం రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కేసును కొట్టేస్తూ తీర్పునిచ్చింది.