calender_icon.png 2 November, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెనిఫిట్స్ రాక రిటైర్డ్ ఉద్యోగుల నరకయాతన

02-11-2025 12:16:53 AM

  1. ఇప్పటికే 250 మంది గుండె పగిలి చనిపోయారు
  2. జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
  3. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమం లో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని, అయినా రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ రాక నరక యాతన పడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటికే 250 మంది ప్రభుత్వ ఉద్యో గులు గుండె పగిలి చనిపోయారని, వారి మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బును ప్రభుత్వం వాడుకుంటోందని తెలిపారు.

ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్‌తోపాటు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లు నెరవేరాలంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపుని చ్చారు. రాష్ర్టం వచ్చిన తర్వాత ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ మంచి ఫిట్‌మెంట్లు ఇచ్చారని, కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తామంటే ఉద్యోగులు కాంగ్రెస్‌కు ఓట్లేసి మోసపోయారన్నారు. రిటైర్డు ఉద్యోగులు అనారోగ్యం పాలయినా చికిత్స చేసు కోలేని పరిస్థితి ఉందని, మెడికల్ రీయింబర్స్‌మెంట్ డబ్బులు రావడం లేదని ఆవేద న వ్యక్తం చేశారు.

కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ మాట్లాడుతూ... మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు ను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నా రు. గతంలో డీఏలు ఎగ్గొట్టిన వారికి ఉద్యోగులు గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డికి కూడా జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు బుద్ధి చెప్పాలని సూచించారు. ఉద్యోగులు, పెన్షనర్లు జూబ్లీ హిల్స్‌లో బీఆర్‌ఎస్ వైపే ఉన్నా రని స్పష్టం చేశారు. మాటలు తప్ప చేతలు లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో వారు లేరన్నారు.