calender_icon.png 2 November, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోయా టోకెన్ల జారీలో తొక్కిసలాట

02-11-2025 12:16:48 AM

తోపులాడుకోవడంతో కిందపడ్డ రైతులు

  1. ఇద్దరు మహిళా రైతులకు విరిగిన కాళ్లు 
  2. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ఘటన

కుభీర్, నవంబర్ 1: సోయ పంటను అమ్ముకోవడానికి టోకెన్ల కోసం రైతులు ఒక్కసారిగా పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి ఇద్దరు మహిళా రైతుల కాళ్లు విరిగాయి. పదిమంది రైతులకు గాయాలయ్యా యి. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో శనివారం జరిగింది. పీఏసీఎస్ కార్యాలయంలో సోయ పంట కొనుగోళ్లను ప్రభు త్వం ప్రారంభించింది. టోకెన్ల కోసం వచ్చిన వందలాది మంది రైతులు నెట్టుకోవడంతో తోపులాట జరిగింది. మహిళా రైతులు లక్ష్మీబాయి, చంద్రకళ ఇద్దరికీ కాళ్లు విరుగగా మరో 10 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన పీఏసీఎస్ అధికారులు టోకెన్లజారీని నిలి పేశారు. పోలీసులు  రద్దీని నియంత్రించి, కూపన్లను జారీ చేశారు.