02-11-2025 12:18:48 AM
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి) : ‘సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని సర్కస్ కంపెనీలా నడిపిస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ గెలిచిన తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గంలో రూ.4 వేల కోట్ల అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే నేను రాజీనా మాకు సిద్ధం. మరి నీవు ఒపీనియన్ పోల్‌కు రెడీనా?’ అని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌గౌడ్ సవాల్ చేశారు.
మాజీ మంత్రి పద్మారావుగౌడ్, ఇత ర నాయకులతో కలిసి తెలంగాణ భవన్‌లో శనివారం మీడియా సమావేశంలో తలసాని మాట్లాడారు. సన్నబియ్యం, రేషన్ కార్డులు తప్ప సీఎం రేవంత్ రెడ్డి ఇంకేమీ మాట్లాడటం లేదని, ఆయన ఇప్పటికైనా భాష మార్చుకోవాలని హితవు పలికారు. 23 నెలల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఎక్కడ తిరిగారో చెప్పాలన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో రూ.44 వేల కోట్లు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెడితే, కాంగ్రెస్ కేవలం రూ.4,600 కోట్లు మాత్రమే ఉమ్మ డి రాష్ర్టంలో ఖర్చు పెట్టిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లునా కట్టారా అని ప్రశ్నించారు. కేటీ ఆర్ హైదరాబాద్‌లో తిరగలేదని అం టున్న రేవంత్‌రెడ్డి, ‘మీరు హైదరాబాద్‌లో ఉన్నా రా? లేక వేరే దేశంలో ఉన్నా రా?’ అని ఆగ్రహించారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రూ.4 వేల కోట్ల అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. బీఆర్‌ఎస్ డిమాం డ్‌తోనే అజారుద్దీన్ మంత్రి పదవి వచ్చిందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే పదవి ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 23 నెల ల్లో రేవంత్‌రెడ్డి పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
అన్నపూర్ణ అంటే కేసీఆర్ కుటుంబం పేరు కాదు కదా, మరి అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరమ్మ క్యాంటీన్లుగా ఎందుకు మార్చారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని సర్కస్ కంపెనీలా నడిపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకపోతే పథకాలు ఆగుతాయని ప్రజలను రేవంత్ రెడ్డి భయపెడుతున్నారని, ఈ విషయం ఓటర్లు గమనించాలని కోరారు. సంక్షేమ పథకాలు ఆగితే పోరాటం ఎలా చేయాలో, అసెంబ్లీని ఏ విధంగా స్తంభింపచేయాలో తమకు తెలుసని పేర్కొన్నారు.