calender_icon.png 9 October, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 విషయంలో అడుగడుగునా తప్పులే: కవిత

09-10-2025 01:26:27 PM

గ్రూప్-1 నియామకాల్లో అవకతవకలపై రౌండ్ టేబుల్ సమావేశం

విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు

హైదరాబాద్: తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) ఆధ్వర్యంలో గ్రూప్-1 నియామకాల్లో అవకతవకల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం(Roundtable meeting ) నిర్వహించారు. గ్రూప్-1 విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడికి కార్యక్రమాలు చేపడతామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) వెల్లడించారు. 15 వ డివిజన్ బెంచ్ తీర్పుపై విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ఈ నెల 15 వరకు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు కవిత సూచించారు. ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపేందుకు రౌండ్ టేబుల్ భేటీ ఏర్పాట చేశామని వెల్లడించారు. గ్రూప్-1 విషయంలో అడుగడుగునా తప్పులు జరిగాయని కవిత ఆరోపించారు. ప్రస్తుతం ఇచ్చిన ఉద్యోగాలు రద్దు చేసి మళ్లీ పరీక్ష పెడతారని భావిస్తున్నామని కవిత అన్నారు. రౌండ్ టేబుల్ భేటీ తీర్మానాన్ని గవర్నర్, సీఎంకు పంపిస్తామని కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. విద్యార్థులకు జాగృతి భరోసా ఉంటుందని కవిత హామీ ఇచ్చారు.