calender_icon.png 1 July, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజం

01-07-2025 01:02:45 AM

 జిల్లా విద్యాధికారి, డాక్టర్ రాధా కిషన్

చేగుంట, జూన్ 30 : ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజమని, వారు చేసిన సేవలే గుర్తింపునిస్తాయని మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ తెలిపారు. సోమవారం చేగుంట మండల పరిధిలోని చందాయిపేట ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయురాలు  కంచర్ల అజిత పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. ఉత్తమ ఉపాధ్యాయులకు సమాజంలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందని, విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే  ఉపాధ్యాయులకు సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్, ఎంఈవో నీరజ, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అమర్ శేఖర్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సంతోష, వివిధ సంఘాల జిల్లా,మండల నాయకులు, ఉపాధ్యాయులు, చల్లా లక్ష్మణ్, వెంకట్రాంరెడ్డి , రాజగోపాల్ గౌడ్, వరాల నర్సింలు, విట్టల్ రెడ్డి, రంగా రెడ్డి, జనార్దన్ రెడ్డి,రావుల వెంకటేష్, మనోహర్ రావు, పెంటా గౌడ్, కృష్ణమూర్తి, నరసింహ రావు, బాల పోచయ్య, తిరుపతి రెడ్డి, చల్లా రామకృష్ణ పాల్గొన్నారు.