calender_icon.png 1 July, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలి

01-07-2025 01:01:16 AM

జిల్లా వ్యవసాయ అధికారి రాధిక

కొండపాక, జూన్ 30: పప్పు దినుసుల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక అన్నారు. కొండపాక మండలం దుద్దెడ రైతు వేదికలో సోమవారం కంది విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద కంది విత్తనాలు, చిరు సంచులు ఎల్ ఆర్ జి-41 రకం విత్తనాలను రైతులకు అందచేశారు.

పప్పు దినుసులు పంట విస్తీర్ణం గణనీయయంగా పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయన్నారు. పంట విస్తీర్ణం  పెంపు తో పాటు పప్పు దినుసుల సాగు ద్వారా లాభాలు పొందాలని, ప్రధాన పంటగా లేదా అంతర పంటగా సాగు చేయాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శివరామ కృష్ణ , ఏఎంసి వైస్ ఛైర్మెన్  బట్ట పార్శారములు, పీఏసిఎస్ డైరెక్టర్ సురేందర్ రావు, లింగారావు, మల్లికార్జున్, కొయ్యడ వెంకటేశం, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.