calender_icon.png 1 July, 2025 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సీఐ, ఎస్‌ఐలను కలిసిన వికలాంగ సంఘాలు

01-07-2025 01:04:21 AM

కొండాపూర్, జూన్ 30 :  కొండాపూర్ పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ సుమన్ కుమార్, ఎస్ ఐకె సోమేశ్వరిని వెన్నముఖ గాయ వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి షఫీ అహ్మద్, సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ జి ప్రవీణ ,సంఘం రాష్ట్ర నాయకులు ఎస్ వెంకటేష్ మర్యాద పూర్వకంగా సోమవారం కలిశారు.

ఈ సందర్భంగా అధికారులకు మొక్కలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐ సుమన్ కుమార్ మాట్లాడుతూ వీల్ చైర్ వినియోగదారులతో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చే వికలాంగులకు అనుగుణంగా ఉండేందుకు ర్యాంపు  ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొండాపూర్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పోలీస్ శాఖతో పూర్తి సహకారం అందిస్తామని షఫీ అహ్మద్ తెలిపారు.