29-06-2025 12:00:00 AM
రెట్రో ఫ్యాషన్.. పాతకాలం నాటి సంప్రదాయానికి భిన్నమైన ప్రతిరూపం ఇది. ఆనాటి ఫ్యాషన్‌కు కొత్తగా మెరుపులు అద్ది.. ట్రెండ్ సృష్టిస్తున్నారు డిజైనర్లు. ప్రస్తుతం మగువల మనసు దోసేసింది ఈ ఫ్యూజన్ స్టుల్ లెహంగా విత్ ఎంబ్రాయిడరీ దుప్పట్ట.
ఇటు సంప్రదాయబద్ధంగా, అటు ట్రెండ్‌కు తగ్గట్టు ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్రను వేసింది. ఈ తరం అమ్మాయిలు చీరలు, చుడీదార్లను కాదని.. టీస్, హుడీస్, లెహంగా, బటన్ డౌన్ షర్టులు.. ఇలా ప్రతిదీ వారికి అనుకూలంగా ఉండాల ని కోరుకుంటూనే.. వింటేజ్ లుక్‌లో కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు.
వీటిలో కొన్నిటికి పైన విడిగా కోట్ వేసుకునేలా వస్తే.. మరికొన్నిటికి నడుము దగ్గర పెట్టుకునేలా సన్నటి బెల్ట్ లాంటిది ఉంటుంది. దీంతో షేప్ చక్కగా కనిపిస్తుంది. సింపుల్ జువెలరీ, ఫ్యాషనబుల్ చెప్పులు జోడిస్తే సరి.. క్రేజీ స్టుల్ మీ సొంతం.
ఇదో ఫ్యూజన్ స్టుల్.. లెహంగాలో ఉన్న కంఫర్ట్‌ను, దుప్పట్టలో ఉన్న విభిన్నతను కలగలిపి దీన్ని తయారు చేశారు. సాధారణ కుర్తీలాగానే నిమిషంలో దీన్ని తొడుకోవచ్చు. వింటేజ్ లుక్‌లో కనిపించాలంటే.. టాప్ టూ బటమ్‌పైకి ఎంబ్రాయిడరీ చున్నీతో హుందాగా కప్పేస్తున్నారు. ఇది ఒక విధమైన ట్రెండ్.