రెతు భరోసా 2 వేల కోట్లు విడుదల
రైతన్నలకు శుభవార్త
మూడు రోజుల్లో 5 ఎకరాలకు పైబడిన రైతులకు చెల్లింపులు
రైతుల ఖాతాలో నగదు జమ
విపక్షాల విమర్శలకు చెక్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
పంటనష్ట పరిహారం, భరోసా నిధుల విడుదలపై అన్నదాతలు హర్షం
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి) : ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. తాజాగా ఐదు ఎకరాలకు పైబడిన వారికి కూడా రైతు భరోసా నిధులు చెల్లింపులు ప్రారంభించింది. ఇందుకు రూ. 2 వేల కోట్ల నిధులు విడు దలయ్యాయి. యాసంగి పంటకు సంబం ధించిన పెండింగ్ బకాయిలను సోమ వారం నుంచి మూడు రోజుల్లో 39 లక్షల ఎకరాలకు చెల్లింపు ప్రక్రియ చేయను న్నట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 111 లక్షల ఎకరా లకు రైతు భరోసా పంపిణీ పూర్తిచేసింది. రాష్ట్ర ఖజనాలో అందుబాటులో ఉన్న నిధులతో నగదు బదిలీ ప్రారంభించింది. అర్బీఐ నుంచి అప్పు తీసుకుంటుండగా ఆ నిధులు మంగళవారం ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి.
ఆలోపు రైతు భరోసా చెల్లింపులు ప్రారంభించా లని ఆర్థికశాఖకు ఆదేశాలు వెళ్లాయి. వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే చెల్లింపు బిల్లులు సమర్పించారు. గతంలో మాదిరిగా తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులు ముందుగా, ఎక్కువ విస్తీర్ణం రైతులకు దశలవారీగా వచ్చేలా సాఫ్ట్‌వేర్ విధానం రూపొందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత, గత ప్రభుత్వం జమ చేసిన రూ. 7వేల కోట్ల నుంచి 5 ఎకరాల లోపు రైతులకు జనవరి చివరి వారంలో ఖాతాలో జమ చేసింది. తరువాత ఆర్థిక భారం కారణంగా మిగతా రైతులకు అప్పట్లో చెల్లించకలేకపోయింది. ప్రస్తుతం సర్దుబాటు చేసి మిగతా రైతులకు భరోసా నిధులు చెల్లిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని, తాము అధికారంలోకి వస్తే రైతులకు పంట సహాయం కింద రూ. 15వేలు జమచేస్తానని హామీ ఇచ్చి పాత పద్ధతి పాటించడంపై విమర్శలు చేశారు.
ఎట్టకేలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి మూడు రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. అన్నదాతలు హర్షం: ప్రభుత్వం రైతులకు పంట నష్టంతో పాటు రైతు భరోసా నిధులు విడుదల చేయడం పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం, భరోసా నిధులు ఎకరానికి రూ.10వేల చొప్పున ఖాతా లో జమచేయడం గర్వకారమని అన్నారు. ఎట్టకేలకు నిధులు రావడంపై ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తు న్నారు. అదేవిధంగా రబీ పంటకు సంబంధించిన సహాయం కూడా త్వరలో విడుదల చేయాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.




