నదిలో పడిన టెంపో.. 18 మంది మృతి
ఉత్తరాఖండ్‌లో ఘటన
ఉత్తరాఖండ్, జూన్ 15: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలకనంద నదిలో ఓ టెంపో పడిన ఘటనలో 1౪ మంది వరకు మృతి చెందారు. మరో ౧౧ మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ టెంపోలో మొత్తం 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. రుద్రప్రయాగకు 5 కిలోమీటర్ల దూరంలోని రతౌలీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హైవే పైనుంచి వెళుతుండగా అదుపుతప్పిన టెంపో ౫౦౦ మీటర్లు దొర్లుకుంటూ వెళ్లి నీటిలో పడిపోయింది.
ప్రమాదాన్ని చూసిన స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను దింపి మునిగిపోయిన వారిని కాపాడారు. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా గుప్తకాశీలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.






