22 July, 2026 | 6:47 PM

రేవంత్ తుగ్లక్ ప్రవర్తన మార్చుకో!

01-06-2024 03:04 AM

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్  హితవు

నిజామాబాద్, మే 31(విజయక్రాంతి) : ప్రజాభిప్రాయం లేకుండా సీఎం రేవంత్ రాష్ట్ర చిహ్నం మార్చడం తుగ్లక్ చర్య అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సత్యనారాయణ అభివర్ణించారు. ఫోన్‌ట్యాపింగ్ కేసును పక్కదోవ పట్టించడానికే గుర్తు లు, మార్పులంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రజలను విస్మరిస్తే బీఆర్‌ఎస్ గతే పడుతుందని హెచ్చరించారు.

ప్రజాభిప్రాయాలను గౌరవిస్తే.. వారు కోరుతున్నట్లుగా నిజామాబాద్‌ను ఇందురుగా, అదిలాబాద్‌ను ఏదులాపురంగా, వరంగల్‌ను ఓరుగల్లుగా, మహబూబాబాద్‌ను మానుకోటగా, హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. రైతు పక్షపాతి అంటూనే విత్తనాల కోసం ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీచార్జీ చేయడం కాంగ్రెస్ కుహనారాజకీయాలకు అద్దం పడుతోందని విమర్శించారు. రైతులకు సరిపడ కరెంటు, నాణమైన ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలని కోరారు.