జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్, మే 26: నారాయణఖేడ్ మండల పరిధిలోని ర్యాకల్ పిఎసిఎస్ పరిధిలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన జొన్నలను చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.
రైతులు మార్కెట్లో దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రంలోని అమ్ముకొవాలని సూచించారు. అనంతరం స్థానిక మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏడీఏ నూతన్ కుమార్, ఏఈఓ రఘు, జ్ఞానేశ్వర్, ప్రతాపరెడ్డి, కిషన్ నాయక్, లక్ష్మీ ,మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, జైపాల్, రమేష్ చౌహాన్, పండరి రెడ్డి, రాజు, వెంకట్ రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






