27 March, 2026 | 11:20 AM

రైతుల సమస్యలపై రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం

17-05-2024 12:42 AM

అన్నదాతలను గాలికొదిలేసిన సీఎం

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదు 

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ 

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): రైతుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు రైతులను తన మాటలతో మభ్యపెట్టి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ... రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ రైతులను ఇబ్బంది పెడుతోందన్నారు. కొన్ని మండలాల్లో ఇంకా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనేలేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. రైతు బంధుతో పాటు రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. రుణమాఫీ కోసం రైతు కార్పొరేషన్ అంటూ కాంగ్రెస్ మాటలు చెబుతోందన్నారు. 

ఫసల్ బీమా విషయంలో కాంగ్రెస్ సర్కారు ముందుకు రాలేదన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య అనుబంధం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బయ టపడిందని విమర్శించారు. కేసీఆర్ సీ ఎంగా ఉన్నప్పుడు బీజేపీని ని రోధించేందుకు ఓటుకు నోటు కేసులో రేవ ంత్‌రెడ్డిని కాపాడారన్నారు. ఇప్పుడు మళ్లీ బీజేపీని అడ్డుకునేందుకు నేటి సీఎం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.