అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
ఎమ్మెల్సీ, గ్రూప్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు
సూర్యాపేట, మే16 (విజయక్రాంతి) : ఈ నెల 27న జరుగనున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, జూన్ 9న జరుగనున్న గ్రూప్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అధికారులను ఆదేశించారు. గురు వారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాసన మండలి ఎన్నికల్లో 52 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన 142 జంబో బ్యాలెట్ బాక్సులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా నుంచి తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సూర్యాపేట డివిజ న్‌లో 31 పోలింగ్ కేంద్రాలు, కోదాడ డివిజన్‌లో 22, హుజుర్‌నగర్ డివిజన్‌లో 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్న ట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 51,497 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారని తెలిపారు. మరోవైపు, జూన్ 9న జరుగనున్న గ్రూప్ పరీక్షకు జిల్లాలో 9,744 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారని, వీరి కోసం 40 సెంటర్లను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అన్ని సెంటర్లలో మౌళిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్య క్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్దె, అదనపు కలెక్టర్ ప్రియాంక, సిఈవో అప్పారావు, డిపివో సురేష్ కుమార్, డిఎఫ్‌వో సతీష్, డిపిఆర్‌వో రమేష్ తదతరులు పాల్గొన్నారు.




