13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా అన్నపర్తి జ్ఞాన సుందర్

27-03-2026 10:59 AM

నాలుగోసారి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపిక పట్ల సర్వత్ర హర్షం

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో గురువారం జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠంగా సాగింది. అధ్యక్షుడిగా అన్నెపర్తి జ్ఞాన సుందర్, తాళ్లపల్లి సత్యనారాయణ ఇద్దరు బరిలో నిలవగా 16 ఓట్ల గాను ఇద్దరికీ సమానం రావడంతో డ్రా తీయగా అన్నెపర్తి జ్ఞానసుందర్ కు అధ్యక్ష పదవి వరించిందని ఎన్నికల అధికారి ఎస్కే.వజీర్ తెలిపారు.  దీంతో జ్ఞాన సుందర్ నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా జ్ఞాన సుందర్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని, కోర్టు నూతన భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని, న్యాయవాదులకు కావాల్సిన హెల్త్ కార్డులు, నూతన కోర్టు భవనంలో రూ.1లక్షతో లైబ్రరీ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన  న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారిని పలువురు న్యాయవాదులు వైస్ ప్రెసిడెంట్ పర్వీన్ బేగం, జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, వేణు యాదవ్, రాజు, శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.