31-07-2024 03:45:16 PM
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో చర్చలు వాడీవేడిగా సాగుతున్నాయి. చర్యలో భాగాంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత సభకే రారు.. బీఆర్ఎస్ వాళ్లు కలిసి వస్తామంటే ఎలా నమ్మాలి..? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 2014 నుంచి 2018 వరకు రాష్ట్రంలో మహిళా మంత్రే లేరని, ఐదేళ్లు ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదని సీఎం ఆరోపించారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదని మొసలికన్నీరు కారుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి సహకరించాలని అనుకుంటే ప్రతిపక్ష నేత సభకు రావాలని సీఎం డిమాండ్ చేశారు.