17 March, 2026 | 3:50 AM

కోచింగ్‌ సెంటర్ల నియంత్రణకు చట్టం

31-07-2024 03:35 PM

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని కోచింగ్ కేంద్రాల నియంత్రణకు చట్టం తెస్తామని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి వెల్లడించారు. ఓల్డ్ రాజేంద్రనగర్ రావుస్ కోచింగ్ సెంటర్ బేస్ మెంట్ లో ముగ్గురు సివిల్ అభ్యర్థులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు. అధికారులు, విద్యార్థులతో చట్టం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల అర్హత, ఫీజు నియంత్రణ, తప్పు దోవ పట్టించే ప్రకటనల నిరోధించే నిబంధనలు ఈ చట్టంలో పొందుపరుస్తామని వివరించారు. బేస్ మెంట్లలో కోచింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అతిషి తెలిపారు. ఇప్పటికే 30 కోచింగ్ సెంటర్ల బేస్ మెంట్లను సీల్ చేశామని ప్రకటించారు. మరో 200 కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశామని అతిషి వెల్లడించారు. ఓల్డ్ రాజిందర్ నగర్ ఘటనపై రాబోయే 6 రోజుల్లో మెజిస్టీరియల్ దర్యాప్తు నివేదిక అందుతోందన్నారు. అధికారులు దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.