19 May, 2026 | 1:28 AM

నేడు పాలమూరుకు రేవంత్‌రెడ్డి

10-11-2024 12:02 AM
  1. సీసీకుంట మండలంలో కురుమూర్తిస్వామిని దర్శించుకోనున్న సీఎం 
  2. ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికార యంత్రాంగం 

  3. మహబూబ్‌నగర్, నవంబర్ 9 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్నారు. హెలిక్యాప్టర్ ద్వారా ఉదయం 11:15 గంటలకు సీసీకుంట మండల పరిధిలోని కురు మూర్తిస్వామి దేవాలయానికి చేరు కోనున్నారు. 11:35 గంటలకు ఎలివెటేడ్ కారిడార్ ఘాట్‌రోడ్డుకు నిర్మా ణానికి శంకుస్థాపన చేయనున్నారు. 11:40 గంటలకు శ్రీకురుమూర్తిస్వామిని దర్శనం చేసుకుం టారు. 12:20 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు. ఈ మేరకు సీసీకుంట మండలం కురుమూర్తి అలయ పరిసర ప్రాంతాల్లో అధఙకారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.