ఎనిమిదేళ్ల్లకు చేతికందిన పట్టా
780 మంది రైతుల భూములకు అధికారిక భరోసా
మహబూబాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): రైతు చేతికి పట్టా పాస్ పుస్తకం(title passbook).. భూమి హక్కుకు(land right) అది ఒక భరోసా.. 8 ఏళ్లుగా కళ్లల్లో ఆశలు.. అధికారులు, ప్రజాప్రతినిధుల కార్యాలయాలకు తిరిగి తిరిగి చెప్పులరిగాయి. అసలు ఒక దశలో ఇక తమ భూములపై హక్కులు కోల్పోవాల్సిందేనా అనే సందేహాలు కూడా వ్యక్తం చేశారు. అయితే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి(Dharani)కి బదులు భూభారతి చట్టం(Bhu Bharathi Act) చేయడంతో వారి ఆశలు చిగురించాయి.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన హామీని నెరబెట్టుకునేలా ప్రత్యేకంగా కృషిచేసి, సోమవారం నారాయణపురానికి చెందిన 780 మంది రైతులకు వారు ఇంతకాలం సాగు చేసుకుంటున్న 1468.15 ఎకరాల భూమికి నూతనంగా పట్టా పాస్ పుస్తకాలను అందజేశారు.
తమ భూమికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలను చేతుల్లోకి తీసుకున్న మరుక్షణం భావోద్వేగానికి గురయ్యారు. ఎనిమిదేళ్లుగా మోసిన బాధ్యత నేడు దిగిపోయినట్లు అయిందని ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి పేర్కొన్నారు. ప్రభుత్వంతోపాటు పట్టా పాస్ పుస్తకాల జారీ కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.






