రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందించాలి
రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ లోకేష్ కుమార్
వరంగల్/జనగామ, జూన్ 19 (విజయక్రాంతి)ఫ భూధార్ సర్వే, భూభారతి దరఖా స్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, సాదాబైనామా, రీ-సర్వే ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలని, రెవెన్యూ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాలని రా ష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం, హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవె న్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ లోకేష్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లాలకు కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులతో భూధా ర్ సర్వే, భూభారతి, సాదాబైనామా, నాన్-కడాస్ట్రల్ గ్రామాల రీ-సర్వే, నక్షా కార్యక్రమం, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడు తూ.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న భూధార్ సర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రతి భూ యజమానికి ఖచ్చితమైన భూ వివరాలు నమోదు అయ్యే లా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే భూభారతి కార్యక్ర మం కింద వచ్చిన దరఖాస్తులను ఎటువం టి జాప్యం లేకుండా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి, అర్హులైన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, భూ ములకు సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయా లని పేర్కొన్నారు. జిల్లాల్లో కొనసాగుతున్న నాన్-కడాస్ట్రల్ గ్రామాల రీ-సర్వే కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల ని, ఎంపిక చేసిన గ్రామాల్లో నక్షా డిజిటల్ భూ మ్యాపింగ్ పనులను నాణ్యత ప్రమాణాలతో అమలు చేయాలని ఆదేశించారు. భూముల హద్దుల నిర్ధారణలో పారదర్శకత పాటిస్తూ భూ రికార్డుల ఆధునీకరణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.






