2 May, 2026 | 7:19 PM

Breaking News

ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ   •   అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి   •   మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •  

కంపోస్ట్ తయారీ ప్రక్రియపై సమీక్ష

06-03-2026 01:36 AM

మేడిపల్లి మార్చి 5 (విజయక్రాంతి) : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బొడుప్పల్ సర్కిల్ పరిధిలోని పీర్జాదిగూడ మోడల్ డంపింగ్ యార్డ్ (సాలిడ్ వెస్ట్ పార్క్ & ప్రాసెసింగ్ యూనిట్) ను గురువారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణరెడ్డి సందర్శించడం జరిగిం ది. ఈ సందర్భంగా కమిషనర్ జోనల్ కమిషనర్లు రాధిక గుప్తా, హేమంత్ కేశవ్ పాటిల్, బొడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజ తో కలిసి డంపింగ్ యార్డ్లో జరుగుతున్న వ్యర్థాల వర్గీకరణ ప్రక్రియ, అలాగే కంపోస్ట్ తయారీ విధానంపై సమీక్ష నిర్వహించారు.

అనంతరం డంపింగ్ యార్డ్లో తడి, పొడి వ్యర్థాలను వేరు చేసే విధానం, సేకరించిన తడి వ్యర్థాల నుండి కంపోస్ట్ తయారీ విధానం, ప్రాంగణం పరిశుభ్రత, నిర్వహణపై అధికారులు కమిషనర్‌కు వివరించారు. కమిషనర్ వ్యర్థాల వర్గీకరణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్లో శాస్త్రీయ పద్ధతులను పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యమములో డీఇఇ (ఎస్‌డబ్ల్యూ ఎమ్) కె. జాహ్నవి శశాంక్, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.