26 June, 2026 | 6:51 PM

Breaking News

కలుగోట్ల ఫీల్డ్ అసిస్టెంట్‌కు షోకాజ్ నోటీసులు

16-04-2026 01:55 AM

అలంపూర్ ఏప్రిల్ 15:ఉండవల్లి మండల పరిధిలో  కలుగోట్ల గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద విధులు నిర్వహిస్తున్న  ఫీల్డ్ అసిస్టెంట్ శంకరయ్యకు ఎంపీడీవో తిరుపతన్న ఈనెల 13న షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.ఫీల్ అసిస్టెంట్ శంకరయ్య ఈనెల 8,9, 13న తన భార్య,వదిన, చెల్లెలు మరియు తనకు సంబంధించిన వ్యక్తుల పేర్లపై ఉదయం ఒకసారి ఫోటో తీసి ఇంటికి పంపించి, తిరిగి పనిస్థలానికి తీసుకువచ్చి రెండోసారి ఫోటో తీసి హాజరు చూపిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా భావించబడుతూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు తేలింది.

ఈ విషయంపై అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.అదనంగా ఫీల్ అసిస్టెంట్ శంకరయ్య గత 15 సంవత్సరాలుగా ఇదే విధంగా అవినీతి చర్యలకు పాల్పడుతూ, తనకు సంబంధించిన వ్యక్తులకు కూడా తప్పుడు హాజరు చూపించి, వచ్చిన డబ్బును పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక కుటుంబ సభ్యులు కూడా పని చేయకపోయినా ఉపాధి హామీ పథకం కింద చెల్లింపులు పొందినట్లు సమాచారం.