నీటి నిల్వకుంటలను పరిశీలించిన కలెక్టర్..
ఉట్నూర్, ఆగస్టు 14: పరిగెత్తే నీటికి నడక నేర్పాలి.., నడిచే నీటికి నిలకడ నేర్పాలి.. అనే నానుడి స్ఫూర్తితో జిల్లా యంత్రాంగం గ్రామాల్లో నీటి నిల్వ కుంటలు, పంట కుంట పనులను ముమ్మరంగా చేపట్టారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో చేపట్టిన నీటి నిలవకుంటల పనులను జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఐటీడీఏ పీవో మంద మకరందులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రైతు చేనులో నీటి నిలువ కుంటలను నిర్మించుకునేందుకు ప్రభుత్వం 90 వేల నుంచి 1.30 లక్షల రూపాయలు అందిస్తుందని గుర్తు చేశారు. ప్రతి రైతు తనకు చేనులో నీటి కుంట నిర్మించుకుంటే వ్యవసాయ పనులతో పాటు ఇతర సౌకర్యాలకు ఎంతగాను ఉపయోగపడంతో పాటు వర్షపు నీటిని భూగర్భ జలంలో పొదుపు చేసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జలసిరి పథకాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీరితోపాటు డిఆర్డిఓ పిడి రవీందర్ రాథోడ్, ఎంపీడీవో మహేందర్, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ తుకారాం, ఉపాధి హామీ అధికారులు, రైతులు పాల్గొన్నారు.






