దేశాభివృద్ధిలో యువతే కీలకం
విద్యావ్యవస్థ ఎంతో మెరుగైంది
గత పదిహేనేళ్లలో ఇది సాధ్యమైంది
జీడీపీలో 18 శాతం వ్యవసాయ రంగమే
ఉద్యాన వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ రాధాకృష్ణన్
గజ్వేల్, జూన్11: ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉన్నదని, 2047 నాటికి మొదటి స్థానంలోకి తీసుకురావాలన్న లక్ష్యాన్ని చేరేందుకు యు వత శ్రమించాలని తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ మూడో స్నాతకోత్సవానికి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లా డారు.
15 ఏళ్లలో దేశంలో విద్యావ్యవస్థ చాలా మెరుగుపడిందన్నారు. భారత జీడీపీ 18 శాతం పైగా వ్యవసాయంపైనే ఆధారపడిందని, మరింత వృద్ధిరేటు కోసం ప్రభుత్వం సహజ, సేంద్రియ వ్యవసాయానికి మద్దతునిస్తుందన్నారు. వ్యవసాయంతో పాటు ఉద్యాన, అటవీ రంగాలకు ప్రాధాన్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో 70 శాతం పైగా గ్రామీణులకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమేనన్నారు. ఇండియన్ జీడీపీలో 47 శాతం అగ్రికల్చర్ ఐసీఐఆర్‌లు అండగా నిలుస్తున్నాయన్నారు. ప్రపంచంలో అబ్రహం లింకన్, నరేంద్రమోదీ తమదైన ముద్రవేశారన్నారు.
సాగునేల, సహజవనరులు, పంటల ఉత్పాదకత తగ్గుతుండడంతో పాటు పర్యావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర, ఆహార, పోషక భద్రతతో పాటు సూపర్ ఎకానమిక్ పవర్‌గా భారత్ ఎదిగేందుకు టెక్నాలజీ ఆధారిత వ్యవసాయంపై దృష్టి సారించారించాలని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ గీతాలక్ష్మి సూచించారు. వర్సిటీ వీసీ డాక్టర్ నీరజ ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు లు సాగుచేస్తున్న బాలనగర్ సీతాఫలం, ఆర్మూర్ పసుపుతో పాటు మరికొన్ని స్థానిక పంటలకు భౌగోళిక గుర్తింపు, రైతు వంగడాల రిజిస్ట్రేషన్, పామాయిల్‌పై పరిశో ధనలు, ప్రధాన ఉద్యాన పంటల్లో సేంద్రీయ సాగు, నూతన రకాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. స్నాతకోత్సవం సందర్భంగా పలువురు విద్యార్థులకు బంగారు పతకాలను అందించారు.






