calender_icon.png 13 August, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్రమత్తంగా ఉండాలి

13-08-2025 01:33:37 AM

  1. రానున్న 72 గంటలు అత్యంత కీలకం
  2. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు
  3. విద్యుత్, వైద్యారోగ్య, విపత్తు నిర్వహణ.. సహా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి
  4. ప్రాణనష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి
  5. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
  6. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ 

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): ఎంతటి భారీ వర్షాలు వచ్చినా ప్రా ణనష్టం వాటిల్లకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు కాజ్‌వేలు, ఉ ద్ధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకలు, వంతెనలపై నుంచి రాకపోకలు లే కుండా చూడాలని సీఎం సూచించారు. పశువులు, గొర్రెలు, మేకల కాపర్లు తరచూ వాగు ల్లో చిక్కుకొనిపోతున్నారని, ఈ విషయంలో ముందస్తుగా వారిని అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.

ప్రమాదవశాత్తూ ఎవరైనా వరదల్లో చిక్కుకుంటే వారిని తక్షణమే బయ టకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అదే సమయంలో పశు నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. రానున్న 72 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అతిభారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ఉన్న జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిం చాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రా మకృష్ణారావుకు సీఎం సూచించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని, అంతా క్షేత్ర స్థాయిలో అం దుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. 

లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి 

జల విద్యుత్ తయారీపైనా దృష్టి సారించాలని, అదే సమయంలో నీటి విడుదలపై పూర్తి సమాచారం లోతట్టు ప్రాంతాల ప్రజలకు తెలియజేయాలన్నారు. చెరువులు, కుం టలు కట్టల తెగే ప్రమాదం ఉన్నందున ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికా రులు, సిబ్బంది 24/7 అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు, విద్యుత్ స్తంభాలు, ఇతర సామగ్రి సిద్ధంగా ఉంచాలన్నారు. సమస్య ఎక్కడ తలెత్తినా తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు. వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని.. పీహెసీలు, సీహెచ్‌సీల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, గర్భిణులను తక్షణమే తరలించేలా అంబులెన్స్‌లు అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు.

అన్ని పట్టణాల్లో లోతట్టు ప్రదేశాల నుంచి ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని, వారికి అవసరమైన ఏర్పాట్లు చేయా లని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పిడుగుపాట్లతో పశువులు, మేకలు, గొర్రెలు చనిపో యినప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయిం చి బాధితులకు పరిహారం అందేలా చూడాలని పశుసంవర్ధక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. 

సమన్వయంతో పని చేయాలి.. 

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్‌లు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జీహె చ్‌ఎంసీ, హైడ్రా, పోలీస్, ఎంఏయూడీ.. ప్రతి విభాగం సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం సూచించారు. ఐటీ, విద్యా శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిపై సమీక్షించి వర్క్ ఫ్రం హోం, సెలవుల విషయమై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైడ్రా, విపత్తు నిర్వహణ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.

హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు సైతం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగస్వాములు కావాలని రేవంత్‌రెడ్డి సూచించారు.

వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు అందజేయాలని, అదే సమయంలో భ యానక వాతావరణం సృష్టించకుండా జా గ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమ టిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

క్లౌడ్‌బస్టర్‌తో ఊహించనంత నష్టం.. 

రెండు రోజుల్లో ఎంత వర్షపాతం వస్తుం ది.. ఎలా ఎదుర్కోవాలనే దానిపై మనకు మాన్యువల్స్ ఉన్నాయని, కానీ వాతావరణ మార్పులతో రెండు గంటల్లోనే రెండు నెలల వర్షపాతం కురుస్తోందని, క్లౌడ్ బస్టర్స్‌తో ఊహించనంత నష్టం వాటిల్లుతోందని సీఎం తెలిపారు. క్లౌడ్ బస్టర్ పరిస్థితులను ఎదుర్కొనే వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు.

ఊహించనంత వర్షపాతంతో గతంలో ఖమ్మం, వరంగల్ జిల్లాలో ని పలు ప్రాంతాల్లో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని.. అలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కావడానికి వీల్లేదన్నారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లోపై పూర్తి అవగాహనతో ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.