calender_icon.png 20 January, 2026 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారిక చాంబర్‌లో రాసలీలలు

20-01-2026 01:48:25 AM

కర్ణాటకలో డీజీపీ స్థాయి అధికారి రామచందర్‌రావు చౌకబారు చేష్టలు

మహిళలతో సన్నిహితంగా మెలిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

తీవ్రంగా స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. విచారణకు ఆదేశం

బెంగళూరు, జనవరి 19: కర్ణాటక పోలీస్ శాఖలో ఒక అత్యున్నత స్థాయి అధికారి విధుల్లో ఉండి కూడా తన కార్యాలయంలోనే రాసలీలలు సాగించాడు. ఖాకీ యూనిఫాంలో ఉండి కూడా తన దిగజారుడుతనాన్ని లోకానికి చూపించాడు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు బాధితులు రహస్యంగా ఈ వీడియోలను చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. విదేశాల నుంచి డ్రగ్స్ రవాణా చేస్తూ పట్టుబడిన నటి రన్యారావు తండ్రే ఈ పోలీస్ ఉన్నధికారి కావడం చర్చనీయాంశమైంది. కర్ణాటక కేడర్‌లో డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు కొద్దిరోజులుగా తన కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు మహిళలతో సన్నిహితంగా ఉంటున్నాడు. వేర్వేరు సందర్భాల్లో తన చాంబర్‌కు వచ్చిన మహిళలతో ఆయన సన్నిహితంగా ఉంటున్నాడు.

సదరు మహిళలను తాకుతూ, కౌగిలించుకుంటున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. పోలీసుశాఖ ఉన్నతాధికారి అయి ఉండి ఇలాంటి చౌకబారు పనులకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పోలీస్ అధికారిపై విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలను సదరు పోలీస్ అధికారి రామచంద్రరావు తోసిపుచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు పూర్తిగా నకిలీవని కొట్టిపడే స్తున్నారు. ఎవరో కావాలనే తనను లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ వీడియోలను సృష్టించారని పేర్కొన్నారు.